రాష్ట్రంలో ప్రతిపాదించిన పది సౌర విద్యుత్ పార్కులకు మొత్తం 24 బిడ్లు దాఖలయ్యాయి. సీఎం సొంత జిల్లా అయిన కడపకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌తోపాటు అదానీ పవర్స్ అన్ని పార్కులకూ బిడ్‌లు దాఖలు చేశాయి. అధికారుల అంచనాలకు భిన్నంగా కేవలం రెండు పార్కులకు మాత్రమే రెండుకు మించి ఎక్కువ బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌టీపీసీ కడప జిల్లా చక్రాయపేట, అనంతపురం జిల్లా కంబదూరు పార్కుల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు బిడ్‌లను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. కంబదూరులో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు టొరంటో, హెచ్‌ఈఎస్ సంస్థలు బిడ్‌లు వేశాయి. చెరి సమానంగా ప్రాజెక్టులు దక్కించుకునేలా అదానీ, షిర్డీసాయి సంస్థలు బిడ్ దాఖలు చేశాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
![solar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10041548_solar.jpg)
ఎవరీ విశ్వేశ్వరరెడ్డి?
పది సౌర విద్యుత్ ప్రాజెక్టులకు బిడ్‌లు దాఖలు చేసిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎవరిదనే చర్చ గుత్తేదారుల్లో సాగుతోంది. కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డి ఈ సంస్థకు అధినేత. గతంలో ఎస్‌పీడీసీఎల్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం విద్యుత్ శాఖలో కీలకమైన గుత్తేదారుగా మారారు. వైకాపా నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: