ETV Bharat / city

నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం - ఏపీ తాజా వార్తలు

సచివాలయంలో ఇవాళ ఆర్ధిక మంత్రి బుగ్గన అధ్యక్షతన 214 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగనుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల నుంచి లబ్దిదారులకు అందిన రుణాలు, సహకారం తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

SLBC MEETING IN AP
SLBC MEETING IN AP
author img

By

Published : Mar 22, 2021, 10:45 AM IST

సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మధ్యాహ్నం 3 గంటలకు.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు అందిన రుణాలు, సహకారం, తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలులో సాధించిన లక్ష్యాలు, గత ఏడాదిలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపైనా.. ప్రభుత్వం- బ్యాంకర్లు చర్చించనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఆర్థికమంత్రి నేతృత్వంలో ఎస్​.ఎల్.బీ.సీ సమావేశం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా పంజా- కొత్తగా 46,951 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.