దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠం... తెలంగాణలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని శక్తి పీఠం. చూడామణి సూర్యగ్రహణం కారణంగా... అర్చకులు ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, ఆలయాన్ని మూసివేశారు. శుద్ధి సంప్రోక్షణ గావించిన తరువాత ప్రత్యేక పూజల నిర్వహించి మహా మంగళహారతితో ఆలయాన్ని తెరువనున్నారు.
సూర్యగ్రహణం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని మిగతా దేవాలయాలు కూడా మూసివేశారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం సూచించిన వేళల్లో దర్శనాలు సాధ్యం కాకపోవడం వల్ల... అమ్మవారు భక్తులకు తిరిగి రేపు ఉదయం మహా మంగళహారతితో దర్శనమివ్వనున్నారు.
ఇదీ చూడండి : ఆకాశంలో అద్భుతం- వలయాకారంలో రవి దర్శనం