ETV Bharat / city

పరిశ్రమలకు కార్మికుల కొరత...ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం

author img

By

Published : Jan 11, 2021, 10:44 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి సొంతూళ్లకు చేరుకున్న కార్మికులు మళ్లీ వెనక్కు రావడం లేదు. స్వస్థలాలకు వెళ్లిన వారికి రావాలని ఫోన్లు చేస్తున్నా స్పందించటం లేదు. దీంతో పరిశ్రమలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది.

Shortage of labor for industries
పరిశ్రమలకు కార్మికుల కొరత

ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 1.5 లక్షల మంది కార్మికులు రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్నట్లు అధికారుల అంచనా. నిర్మాణ రంగం, క్యాస్టింగ్‌ పరిశ్రమలకు నైపుణ్యమున్న కార్మికులు అవసరం. ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తుండటంతో కార్మికుల కొరత ఇబ్బందిగా మారింది. కొందరేమో గతంలో కంటే ఎక్కువ వేతనాలను డిమాండు చేస్తున్నారు. ఇప్పటికే ముడిసరకు, రవాణా ఖర్చుల భారం పెరిగి ఇబ్బంది పడుతున్న పరిశ్రమలపై వేతనాలు అదనపు భారంగా మారాయి.

సొంతూళ్లకు వెళ్లిన కార్మికుల్లో దాదాపు 50శాతం మంది వెనక్కు రాలేదని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. గత నెల నుంచే కొందరు వచ్చి విధుల్లో చేరారు. నైపుణ్యాలు లేకున్నా స్థానికులతోనే ఏదోలా పరిశ్రమ నడిపిద్దామని చేర్చుకున్నా తర్వాత రోజు వస్తారన్న గ్యారంటీ ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్డర్లు తీసుకోవాలంటేనే భయపడుతున్నామని ఒక పరిశ్రమ నిర్వాహకుడు తెలిపారు. భవిష్యత్తులో ఆర్డర్లు పెరిగితే కార్మికుల సమస్య తీవ్రంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

చెబుతున్న కారణాలివీ..

* లాక్‌డౌన్‌లో ఎన్నో కష్టాలు పడి సొంతూళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. కొవిడ్‌ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. మళ్లీ వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడుతున్నారు.
* లాక్‌డౌన్‌ కాలానికి వేతనాలు చెల్లించినా మేస్త్రీలు కార్మికులకు అందించలేదు. కష్టాల్లో ఉన్న సమయంలో పరిశ్రమల నిర్వాహకులు ఆదుకోలేదన్న భావన వారిలో ఏర్పడింది.
* సొంత ప్రాంతాల్లోనే రోజుకు రూ.250 వంతున వేతనాలు అందించేలా పనులను అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో ఉండటానికే ఇష్టపడుతున్నారు.

సగం మందితో నెట్టుకొస్తున్నాం: పార్థసారథి
మాది కృష్ణా జిల్లా ఎనికేపాడులోని కృష్ణా ఇంజినీరింగ్‌ పరిశ్రమ. భారీ యంత్రాల విడిభాగాలను తయారు చేస్తాం. లాక్‌డౌన్‌కు ముందు సుమారు 250 మంది పని చేసేవాళ్లు. ఇప్పుడు 125 మందే పని చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లిన వారిని వెనక్కు రావాలని ఫోన్లు చేస్తున్నా ఆసక్తి చూపటం లేదు. కొందరు అధిక వేతనాన్ని డిమాండు చేస్తున్నారు.

50 శాతం ఉత్పత్తితో నడిపిస్తున్నాం: శ్రీనివాస్‌
విజయవాడ సమీపంలోని సూరంపల్లిలో జీఎస్‌ఎల్‌ఐ క్యాస్టింగ్‌ పరిశ్రమ మాది. ప్రస్తుతం 50శాతం ఉత్పత్తితో నిర్వహిస్తున్నాం. కార్మికులు తిరిగి రాకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిర్మాణ రంగంలో ఆశించిన స్థాయిలో పనులు దొరక్క.. అందులో పని చేసేవాళ్లు వస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆకాశంలో ఉక్కు ధరలు..సిమెంటుకూ రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.