ETV Bharat / city

ఏప్రిల్​ 4 వరకు ఉద్యోగులకు వంతులవారీ విధానం

author img

By

Published : Mar 23, 2020, 8:06 AM IST

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్​ 4 వరకూ ఈ విధానం కొనసాగనుంది.

shift wise duty for andhra pradesh government employees
ఏప్రిల్​ 4 వరకు ఉద్యోగులకు వంతులవారీ విధానం

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికో బృందం చొప్పున వంతులవారీ పని విధానాన్ని ఏప్రిల్‌ 4 వరకూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల ఉద్యోగులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, స్వతంత్ర సంస్థలకు ఈ విధానం వర్తిస్తుందని శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరించింది. అత్యవసర సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానం వర్తించబోదని స్పష్టం చేసింది.

* పదవీవిరమణ పొంది 60 ఏళ్ల పైబడి సలహాదారులు, ఛైర్‌పర్సన్‌ బాధ్యతల్లో ఉన్నవారికి శాఖాధిపతుల అనుమతితో ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది.

* ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి తీసుకున్నవారు ఇ- ఆఫీస్‌ ద్వారా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

* 50 ఏళ్లు దాటి స్వీయ నిర్భంధంలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వారు వైద్యుల ధ్రువీకరణ లేకుండానే ఏప్రిల్‌ 4 వరకూ సెలవులు తీసుకోవచ్చు.

* ఏప్రిల్‌ 4 వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోకూడదు.

* సాధ్యమైనంత వరకు కార్యాలయాల్లోకి సందర్శకుల రాకను నియంత్రించాలి.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా రెండో దశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.