ETV Bharat / city

వారెవ్వా: శంకర్​రెడ్డి... మూడు దశాబ్దాల సర్పంచ్!

ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల జాతకం ఐదేళ్లకోసారి మారిపోతుంటుంది. ప్రజలకు ఎంతో సేవ చేస్తే కానీ రెండు మూడు దఫాలు అదే పదవిని అలంకరించడం సాధ్యం కాదు. అలాంటిది సర్పంచిగా ఆరుసార్లు గెలుపొందడమంటే ఆషామాషీ కాదు. అది.. ముత్యాలరెడ్డిపల్లేకు చెందిన కోబాకు శంకర్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది.

shankar reddy elected as six time sarpanch in chitoor district

author img

By

Published : Mar 14, 2020, 5:26 PM IST

Updated : Mar 14, 2020, 6:58 PM IST

చిత్తూరు జిల్లా ముత్యాలరెడ్డిపల్లెకి చెందిన కోబాకు కృష్ణారెడ్డిది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం న్యూ బాలాజీ కాలనీగా పిలుస్తున్న ప్రాంతంలో.. ఒకప్పుడు ఆయన కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేది. ఈయన కుమారుడు కోబాకు శంకర్ రెడ్డి, గ్రామంలోని ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ.. పలువురికి సాయం చేస్తూ... సేవాగుణం కలిగిన వ్యక్తిగా ముత్యాలరెడ్డిపల్లెలో మంచి పేరు గడించారు. ఈనేపథ్యంలో 1970లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్నుంచి 1999 వరకు ఆయన జైత్రయాత్ర కొనసాగింది. 29 సంవత్సరాలు ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీకి సర్పంచిగా ఎన్నికయ్యారు.

తుది శ్వాస అక్కడే..

పదవిలో ఉండగానే ముత్యాలరెడ్డిపల్లెలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సమావేశ మందిరంలో సమస్యలపై ప్రశ్నిస్తూ.. అక్కడే శంకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోబాకు శంకర్ రెడ్డి భార్య కోబాకు జయమ్మ ఆయన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా.. ఎవరూ రాజకీయాల్లోకి రాకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

ఇదీ సంగతి: నాటి సర్పంచ్...నేటి ఆర్థిక మంత్రి

Last Updated : Mar 14, 2020, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.