రాష్ట్రానికి ఏడు ఈఎస్‌ఐ ఆసుపత్రులు మంజూరు చేసినట్లు.. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మంత్రి చెప్పారు. ఈ ఆసుపత్రులను విజయనగరం, విశాఖ, కాకినాడ, గుంటూరు, పెనుకొండ, నెల్లూరు, అచ్యుతాపురంలో ఏర్పాటు చేయడానికి.. ఈఎస్‌ఐ కార్పొరేషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు మంత్రి చెప్పారు. విజయనగరంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తవుతుందని.. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: నేటితో ముగియనున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ