ETV Bharat / city

తెలంగాణలో రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు - College medical University

తెలంగాణలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో రెండో విడత వైద్యవిద్య సీట్ల భర్తీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 19 నుంచి 20వ తేదీ వరకు అర్హులు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.

medical admissions
తెలంగాణలో రెండో విడత వైద్యవిద్య ప్రవేశాలు
author img

By

Published : Dec 19, 2020, 7:59 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో రెండో విడత వైద్యవిద్య సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. శనివారం(19న) నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కళాశాలల వారీగా ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ కోటా అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్లను పొందుపర్చాలని వర్సిటీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని సూచించాయి.

మొదటి విడత కన్వీనర్‌ కోటా ప్రవేశాల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో కలుపుకొని 476 మంది తమకు కేటాయించిన కళాశాలల్లో చేరలేదు. ఈ సీట్లు కాకుండా అఖిల భారత కోటా నుంచి రాష్ట్రానికి 60 సీట్లు తిరిగి చేరాయి. వీటికి అదనంగా మొదటి విడత ప్రవేశాల్లో చేర్చని ఎన్‌సీసీ, తదితర కోటాల సీట్లను చేర్చుతారు. అన్నింటి ఫలితాలను ఈనెల 21న విడుదల చేయనుండగా.. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు కేటాయించిన కళాశాలల్లో చేరడానికి ఈనెల 24 వరకు తుది గడువుగా కాళోజీ వర్సిటీ వర్గాలు నిర్ణయించాయి.

అనంతరం ఆఖరి విడతగా మాప్‌ అప్‌ రౌండ్‌ను నిర్వహించనున్నారు. మరోవైపు ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యాజమాన్య(బి), ప్రవాస భారతీయ(సి) కోటాల్లో సీట్ల భర్తీ ప్రక్రియను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు ఈనెల 31 నాటికి అన్ని కేటగిరీల ప్రవేశాలను పూర్తి చేయాలని విశ్వవిద్యాలయ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఎన్‌ఎంసీ దృష్టికి సీట్ల బ్లాక్‌ అంశం

కన్వీనర్‌ కోటాలో తొలి విడత ప్రక్రియలో తెలంగాణ, ఏపీలో దరఖాస్తు చేసుకొని, రెండు ప్రాంతాల్లోనూ స్థానికులుగా ధ్రువపత్రాలు సమర్పించిన 17 మందిని గుర్తించి, వారందరిని ఏపీలో స్థానిక అభ్యర్థుల కోటాలోకి మార్చినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు వైద్య కళాశాలల్లో బి, సి కేటగిరీల్లో సీట్లు ‘బ్లాక్‌’ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం గురువారం నిర్వహించిన ఎన్‌ఎంసీ, అన్ని రాష్ట్రాల ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

అఖిల భారత స్థాయిలో నీట్‌లో 30 నుంచి 40 వేల లోపు ర్యాంకులొచ్చిన ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా బి, సి కేటగిరీల్లో ఇక్కడి ప్రైవేటు వైద్య కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. సీట్లను బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: 'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.