ETV Bharat / city

ap inter results 2021: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల.. - second inter results in ap

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. examresults.ap.nic.in, bie.ap.gov.in , results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్‌సైట్లలో ఫలితాలు పొందవచ్చు.

ap second inter results released
ap second inter results released
author img

By

Published : Jul 23, 2021, 4:32 PM IST

Updated : Jul 23, 2021, 4:55 PM IST

రాష్ట్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్‌ విద్యామండలి.. పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.10లక్షల మంది ఉన్నారు.

ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ‌ఈ వెబ్‌సైట్లలో పొందవచ్చు..

  • http://examresults.ap.nic.in
  • http://results.bie.ap.gov.in
  • http://results.apcfss.in
  • http://bie.ap.gov.in

సంతృప్తి చెందని వారికి మళ్లీ పరీక్షలు..

ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులందరినీ ప్రమోట్ చేశామని మంత్రి సురేశ్‌ అన్నారు. ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ‌ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా మినిమం 35 మార్కులు ఇచ్చామన్నారు.

'మే 5 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనల మేరకు జూన్‌ 25 పరీక్షలు రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నాం. మార్కులు ఎలా ఇవ్వాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం మార్కులకు పదోతరగతి మార్కుల ఆధారంగా 30శాతం వెయిటేజీ, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సాధించిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు విడుదుల చేస్తున్నాం. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా మినిమం 35 మార్కులు ఇచ్చాం. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,08,672 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 2,53,138 మంది, బాలికలు 2,55,534 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణులయ్యారు ' - ఆదిమూలపు సురేశ్​, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి:

schools reopen: రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం ఎప్పుడంటే..!

Last Updated : Jul 23, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.