మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఎన్నిక నిమిత్తం.. ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా పురపాలక శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. 12 నగరపాలికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం సమావేశం కావాలని.. కలెక్టర్లు, జేసీలను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండేసి కార్పొరేషన్లు కలిగిన చిత్తూరు, కృష్ణా జిల్లాలకు.. ప్రిసైడింగ్ అధికారిగా జేసీ రెవెన్యూను నియమించాలని ఎస్‌ఈసీ సూచించింది.
ఇదీ చదవండి: