ETV Bharat / city

విశేష అధికారాలు ఉన్నా.. నా విధి నిర్వహణకు మాత్రమే వినియోగిస్తా: ఎస్‌ఈసీ - పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కామెంట్స్

ఎన్నికలు జరిగితే కక్షలు పెరుగుతాయనడం సరికాదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాదిగా ఎస్‌ఈసీ అభివర్ణించారు.

State Election Commissioner Nimmagadda
ఎస్ఈసీ రమేశ్ కుమార్
author img

By

Published : Feb 3, 2021, 9:43 PM IST

పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకుడు సిద్ధార్థజైన్, కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలు అప్పలనాయుడు, సెంథిల్‌కుమార్​లు హాజరయ్యారు. గత స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు తేడా ఉందన్నారు. రాజ్యాంగ ధర్మాన్ని తాను నెరవేరుస్తున్నానన్న ఎస్‌ఈసీ.. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఎస్‌ఈసీ తెలిపారు.

ఎన్నికలు జరిగితే కక్షలు పెరుగుతాయనడం సరికాదని.. తప్పులు జరగనివ్వమని ప్రజలకు భరోసా కల్పించాలని ఎస్‌ఈసీ సూచించారు. పలు గ్రామపంచాయతీల్లో బాగా పోటీ నెలకొందన్నారు. సామాజిక మార్పులతో అందరూ గుర్తింపు కోరుకొంటున్నారని.. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాదిగా ఎస్‌ఈసీ అభివర్ణించారు. విశేష అధికారాలు ఉన్నా.. తన విధి నిర్వహణకు మాత్రమే వినియోగిస్తానని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీడియాను విశ్వసిస్తున్నాను.. మీడియాకు ప్రధాన పాత్ర ఉందన్న ఎస్‌ఈసీ.. మీడియా బలంగా ఉన్నచోట ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని నమ్ముతున్నట్లు ఎస్‌ఈసీ చెప్పారు.

ఇదీ చదవండి: ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.