ETV Bharat / city

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి: ఎస్‌ఈసీ - మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు. ఎక్కడా రీ-పోలింగ్ చేయాలని వినతులు రాలేదన్నారు. రేపు ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సాహ్ని(Neelam Sahni On Municipal Elections ) వివరించారు.

Neelam Sahni
ఎస్‌ఈసీ నీలం సాహ్ని
author img

By

Published : Nov 16, 2021, 2:16 PM IST

Updated : Nov 16, 2021, 3:03 PM IST

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు(AP SEC Neelam Sahni on Elections news). ఎక్కడా రీ-పోలింగ్ చేయాలని వినతులు రాలేదన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సాహ్ని వివరించారు.

"ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కుప్పం మున్సిపాలిటీలో కొన్ని ఘటనలు జరిగాయి. ఎక్కడా రీ-పోలింగ్ చేయాలనే వినతులు రాలేదు. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 72.19 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 49.89 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచాం. రేపు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది" అని నీలం సాహ్ని తెలిపారు.

ఈ రోజు జరుగుతున్న ఎన్నికలపై స్పందిస్తూ... "ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 18న ఉదయం 8 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. ఈనెల 22న 12 మున్సిపల్‌, నగర పంచాయతీల్లో ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈనెల 22న నెల్లూరు నగర పాలక మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది" అని ఎస్‌ఈసీ నీలం సాహ్ని చెప్పారు.

ఇదీ చదవండి :

CM JAGAN: గులాబ్‌ తుపాను బాధిత రైతులకు రూ.22 కోట్లు : ముఖ్యమంత్రి

Last Updated : Nov 16, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.