అనంతపురం జిల్లా
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఉరవకొండ ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్ పరిసర ప్రాంతాల్లో 29 కర్ణాటక సీసాలను రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న ముగ్గరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నట్లు సిఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కడప జిల్లా
రైల్వేకోడూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారి శివసాగర్ ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నారు. శనివారం చలంపాలెం, యానాది కాలనీ సమీపంలో దాచి ఉంచిన 380 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అధికారి తెలిపారు.
విజయనగరం జిల్లా
జిల్లాలోని నెల్లిమర్ల, ఎల్. కోట, గంట్యాడ, బూర్జి వలస, మక్కువ రూరల్, విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, ఇసుక ట్రాక్టర్, 330 నాటు సారా ప్యాకెట్లు, 20 లీటర్ల నాటుసారా, 42 చిన్న మద్యం బాటిళ్లు, రెండున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఈబీ అదనపు ఎస్పీ కుమారి శ్రీదేవి రావు తెలిపారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో స్థానిక పోలీసులు, ఎస్ఈబి సిబ్బంది దాడులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: