ఫిబ్రవరి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిదో తరగతి నుంచి ఆపై తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
రెవెన్యూ శాఖపై సమీక్షించిన సీఎం.. వారం రోజుల్లో ధరణి పోర్టల్లో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అడవులు పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని, వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు.
పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీృత మార్కెట్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. జనాభాకు అనుగుణంగా వైకుంఠధామాలు నిర్మించాలని తెలిపారు.
ఇదీ చూడండి :