* సినిమాహాళ్లు, ఈతకొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు, జనం గుమికూడటానికి వీలున్న ఇతర ప్రాంతాలు ఆగస్టు 31 వరకు తెరవడానికి వీల్లేదు.
* వందేభారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పరిమితంగా అనుమతిస్తారు. మెట్రో రైళ్లు కూడా నడవవు.
* సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం యథాతథంగా ఉంటుంది.
* వచ్చే నెల 5 నుంచి యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు మాత్రం తెరవొచ్చు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ జారీ చేసే ప్రామాణిక నిబంధనల ప్రకారం వీటిని నిర్వహించాల్సి ఉంటుంది.
* స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించాలి. మాస్క్ ధరించాలి.
* ఆగస్టు 31 వరకు కంటెయిన్మెంట్ జోన్లలో లాక్డౌన్ ఉంటుంది. ఇందులో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన వాటిని అనుమతించకూడదు. ఇక్కడ కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలి.
* కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల కార్యకలాపాలపై అవసరం అనుకుంటే రాష్ట్రాలు తగిన పరిమితులు విధించవచ్చు.
* రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరకు రవాణాకు ఎలాంటి పరిమితులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా అనుమతులు, మంజూరులు, ఇ-పర్మిట్లు అవసరం లేదు.
* పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదన్న నిబంధన అలాగే కొనసాగుతుంది.
* మార్చి 25 నుంచి దేశంలో అమలవుతున్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తేశారు.
* మిగిలిన అంశాల్లో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు, వెసులుబాట్లు యథాతథంగా కొనసాగుతాయి.
ఇదీ చదవండి: అన్లాక్ 3.0: సినిమా హాళ్లకు నో- యోగా కేంద్రాలకు ఓకే