కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు గ్రామాల్లో వ్యాక్సినేషన్ బాధ్యత సర్పంచి, వార్డు సభ్యులు తీసుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సూచించారు. కొవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తలపై పంచాయతీరాజ్‌శాఖ, యునిసెఫ్, భారత ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్) సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,980 శిక్షణ కేంద్రాల్లో 90 వేల మంది సర్పంచులు, వార్డు సభ్యులకు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో కమిషనర్ ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రజలంతా సహకరిస్తే కొవిడ్‌ను ఎదుర్కోగలమని యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీలత స్పష్టం చేశారు. సమావేశంలో భారత ప్రజారోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ జీవీఎస్ మూర్తి, పంచాయతీరాజ్‌శాఖ ప్రతినిధి పి.దుర్గాప్రసాద్ ప్రసంగించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్