గాంధీ ఆశయాల సాధనకు అందరూ ఆయన బాటలో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి జగన్ వల్ల బాపూ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం ఏర్పాటు చేశారన్నారు. అసమానతలు తొలగించి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొని గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటివద్దకే అందిస్తున్నామని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. నామినేటెడ్ పదపులు, వాలంటీర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలూ వారి పేరిట ఇస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో 'బాపు దర్శన్' పేరుతో ఫోటో ఎగ్జిబిషన్