ETV Bharat / city

జగన్​పై ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు: సజ్జల - Sajjala Comments on Jagan

పురపాలక ఎన్నికల్లో వైకాపాకు వచ్చిన అఖండ విజయం.. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులకు ప్రజలు ఇచ్చిన ఆశీస్సులని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతటి స్థాయిలో విజయం దేశంలో ఎప్పుడూ ఎక్కడా రాలేదన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Mar 14, 2021, 4:40 PM IST

జగన్​పై ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు: వైకాపా

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ఉంచారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నూటికి నూరుశాతం స్థానాల్లో వచ్చిన విజయం, ఫలితాలే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెదేపాను ప్రజలు తిరస్కరించారన్న సజ్జల.. నిజమైన ప్రజా నాయకుడు జగన్ అని ప్రజలు నిరూపించారన్నారు. ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ, అభివృద్ది పథకాలు అమలు చేశారన్నారు. ఇంతటి ఘన విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపాలిటిల్లో ప్రజలు ఏకపక్షంగా విజయాన్ని సీఎం జగన్​కు కట్టబెట్టారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. పల్లెల్లోనూ, పట్నాల్లోనూ వైకాపాకు ఒకే విధమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎగిరిన వైకాపా జెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.