రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. రూ.199.24 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లభించేలా రైతు భరోసా కేంద్రాలు రూపొందించనున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు జారీకి వీలుగా సమాచారం అందిస్తారు. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు నియమిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏప్రిల్ 2020 నాటికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంట నుంచి మార్కెటింగ్ వరకు అన్ని సేవలు ఈ కేంద్రాల ద్వారానే ఇవ్వాలని మార్గదర్శకాలు ఇచ్చింది.
ఇదీ చదవండి : రైతు భరోసా కేంద్రం.. అన్నదాతకు వరం..!