విద్యా హక్కు చట్టంలోని నిబంధన ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదని.. న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 25 శాతం సీట్లను భర్తీ చేయకపోవడం వల్ల లక్షల సంఖ్యలో పేద విద్యార్థులు ఏటా నష్టపోతున్నారని తెలిపారు. ఈ అంశం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని... సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది
ఇదీ చదవండి