ETV Bharat / city

కష్టాలు తీరుతాయనుకుంటే కొత్త ఇబ్బందులు.. ఆర్టీసీ విశ్రాంత కార్మికుల ఆవేదన - పింఛన్

RTC Retired Employees: 'బస్సు చక్రం ప్రగతికి చిహ్నం' అంటారు కదా.. ఒకప్పుడు ఆ ప్రగతి రథచక్రాలను నడిపించిన విశ్రాంత ఆర్టీసీ కార్మికులు నేడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే వారి కష్టాలు తీరతాయనుకుంటే.. కష్టాలు తీరటం కాదు కదా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 22, 2022, 5:18 PM IST

విశ్రాంత ఆర్టీసీ కార్మికులకు వీలిన కష్టాలు

RTC Retired Employees Problems: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆనందపడ్డారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి సంతోషించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు అందుతాయని ఆశపడిన ఆర్టీసీ ఉద్యోగులకు మొండిచెయ్యే ఎదురైంది. పేరుకు మాత్రం ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ.. సమస్యలు, సౌకర్యాలను పట్టించుకోకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేయింబవళ్లు విధులు నిర్వహించి అనారోగ్యానికి గురైన తమను పట్టించుకొనే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతికి గాయాలు, మెడకు ఆపరేషన్లు, కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడుతున్న వీరంతా.. ఒకప్పుడు ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టించిన రథసారధులే. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారీ ఆర్టీసీ విశ్రాంత కార్మికులు. విధినిర్వహణలో అందరితో శభాష్ అనిపించుకున్న వీరు.. పదవీ విరమణ అనంతరం కష్టాలు పడుతున్నారు. వీరిలో చాలా మందిని తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్య ఖర్చులు భరించలేక అప్పులతో అవస్థలు పడుతున్న వీరికి.. సీఎం జగన్‌ చేసిన విలీన ప్రకటనతో ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయంతో కష్టాలు తీరిపోతాయని సంతోషించారు. కానీ, నేటికి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో.. తమ గోడు వెల్లబోసుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖలు రాస్తూనే ఉన్నారు.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడంతో సమస్యలు తీరికపోగా.. కొత్త సమస్యలు చుట్టుముట్టాయి. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వైద్య సదుపాయాలు కల్పిస్తారని.. ఆరోగ్యకార్డులు ఇస్తారని ఆశించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆసరా కల్పించలేదు. పైగా గతంలో అందే అపరిమిత వైద్య సదుపాయాన్నికోల్పోయారు. డబ్బులు చెల్లించిన వారికే సాధారణ చికిత్సలు అందిస్తున్నారని.. పెద్ద జబ్బులకు వైద్యం అందించలేమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చేసి వైద్యం చేయించుకున్న వారు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం ఎప్పుడో తొలగించారు. సర్వీసులో ఉండగా తామే ఎస్​ఆర్​బీఎస్​ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని నెలనెల కొంత సొమ్ము చెల్లించగా వాటి ఆధారంగా ఇప్పుడు నెలకు 7 వందల నుంచి 2 వేలు వరకు పింఛన్‌ వస్తోంది. ఆ సొమ్ము పాల ప్యాకెట్లకే సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలు తీర్చాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.