నిబద్ధత గల దేశ పౌరుడుగా అమరావతి పోరాటానికి మద్దతు తెలుపుతున్నానని ఆర్.ఎస్.ఎస్. ప్రతినిధి రతన్ శారద అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులకు చేరిన సందర్భంగా...ఆన్లైన్ ద్వారా ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలని రతన్ శారద స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. తిరుపతి భూములు, ఆస్తులను స్వాహా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు పాలన సాగుతోందని రతన్ శారద విమర్శించారు.
ఇదీ చదవండి : 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట: చంద్రబాబు