ETV Bharat / city

Amaravathi: ‘అమరావతి’ అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం - అమరావతి అభివృద్ధి వార్తలు

Amaravathi: అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం కోసం బ్యాంకులను సంప్రదించగా, ఈ మొత్తాన్ని రెండుగా విభజించి, డీపీఆర్‌లు ఇవ్వాలని వారు సూచించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. . ‘ఒకే రాజధానిగా ఉంటేనే రుణం ఇస్తామని, ఈ విషయంలో హామీ ఇస్తారా అని బ్యాంకర్లు అడిగినట్లు తెలిసింది. అది నిజమేనా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తాయన్నారు.

Rs. 3000 crores loan for development of amaravathi
‘అమరావతి’ అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం
author img

By

Published : May 26, 2022, 7:54 AM IST

Amaravathi: అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం కోసం బ్యాంకులను సంప్రదించగా, ఈ మొత్తాన్ని రెండుగా విభజించి, డీపీఆర్‌లు ఇవ్వాలని వారు సూచించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో బుధవారం కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ‘ఒకే రాజధానిగా ఉంటేనే రుణం ఇస్తామని, ఈ విషయంలో హామీ ఇస్తారా అని బ్యాంకర్లు అడిగినట్లు తెలిసింది. అది నిజమేనా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తాయన్నారు.

ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం.. ‘భూ సమీకరణ సమయంలో రైతులతో చేసుకున్న ఒప్పందానికి సీఆర్డీఏ కట్టుబడి ఉంది. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించే పనిలో ఉన్నాం. ఇప్పటికే 17వేల మందికి నోటీసులివ్వగా 900 మంది ముందుకొచ్చారు. రోడ్లు, మురికి కాలువలు తదితర వసతులను దశల వారీగా కల్పిస్తాం. ఇవన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండటంతో సొంతంగా వనరులను సమకూర్చుకునే అంశంపై దృష్టి సారించాం. ఇందులో భాగంగానే ప్లాట్ల వేలం మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక కౌలు కోసం రూ.208 కోట్లను విడుదల చేశాం.

  • హ్యాపీనెస్ట్‌ విషయంలో రెరా ఇచ్చే ఆదేశాలకు పాటిస్తాం. ఫ్లాట్లకు డబ్బులు చెల్లించిన వారు, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని రెరాను ఆశ్రయించారు. దీనికి త్వరలో ఒక పరిష్కారం కనుగొంటాం.

త్వరలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పూర్తి.. అమరావతిలో వివిధ పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచారు. సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం. నిధుల లభ్యతకు అనుగుణంగా పనులు చేపడతాం. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల పనులను తిరిగి ప్రారంభించాం. ఇవి నవంబరు నాటికి పూర్తవుతాయనే అంచనా ఉంది.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు 90% పైగా పూర్తయ్యాయి. మధ్యలో నాలుగుచోట్ల ఉన్న గ్యాప్‌ల పనులను త్వరలో చేపడతాం. కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో రెండు వరుసలుగా విస్తరిస్తున్నాం. ఈ మార్గంలో 1.6 కి.మీ వరకు విద్యుత్తు స్తంభాలను తొలగించాం. అదనపు కోర్టు హాళ్ల భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఎంఐజీ ప్లాట్లకు ఈ-వేలం.. సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లో మిగిలిన 331 ప్లాట్లకు ఈ-వేలం వేయబోతున్నాం. మొదటి లాట్‌ కింద 29 ప్లాట్ల ద్వారా సుమారు రూ.300 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేశాం. 200 చ.గజాల విస్తీర్ణంలో 23, వెయ్యి చ.గజాల విస్తీర్ణంలో ఆరు ప్లాట్లను అభివృద్ధి చేశాం. మొదటి లాట్‌ ఈ-వేలం ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది.

వేలంలో పాల్గొనదలచిన వారు https://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాల్సి ఉంది. చ.గజం ధర రూ.17,800గా నిర్ణయించాం. రెరా అనుమతికి దరఖాస్తు చేశాం. కొనుగోలుదారులకు రెండు బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం’ అని కమిషనర్‌ వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.