ETV Bharat / city

sand issue:ఇసుక గుత్తేదారులకు రూ.120 కోట్ల బకాయిలు - sand issue in ap

రాష్ట్రంలో 6 నెలల కిందటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులకు పెద్దఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. సొమ్ములు లేవని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. తాజాగా ఓ ప్రాజెక్ట్‌ నుంచి రూ.50 కోట్లు వచ్చాయి.

ఇసుక గుత్తేదారులకు రూ.120 కోట్ల బకాయిలు
ఇసుక గుత్తేదారులకు రూ.120 కోట్ల బకాయిలు
author img

By

Published : Oct 13, 2021, 7:05 AM IST

రాష్ట్రంలో 6 నెలల కిందటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులకు పెద్దఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. సొమ్ములు లేవని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. తాజాగా ఓ ప్రాజెక్ట్‌ నుంచి రూ.50 కోట్లు వచ్చాయి. వీటిని గుత్తేదారుల చెల్లింపులకు, సంస్థ అవసరాలకు వినియోగించుకోకుండా.. ఏపీ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జమచేసి, మళ్లీ ఇప్పుడు నిధుల కోసం ఆరాట పడుతున్నారు. ఇది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల తీరు. తమకు బకాయిలు ఇవ్వకుండా, వేరొక కార్పొరేషన్‌లో నిధులు జమ చేయడం ఏమిటని గుత్తేదారులు మండిపడుతున్నారు. మే నెల వరకు గుత్తేదారులు రీచ్‌లు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేసి, స్టాక్‌ పాయింట్లకు రవాణా చేశారు.

జేపీ పవర్‌ వెంచర్స్‌కు ఇసుక బాధ్యతలను అప్పగించడంతో.. గుత్తేదారులతో ఏపీఎండీసీ ఒప్పందాలు రద్దు చేసుకుంది. వీరికి రూ.120 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఏపీఎండీసీకి మంగంపేట ముగ్గురాయి ప్రాజెక్ట్‌ నుంచి తాజాగా రూ.50 కోట్లు వచ్చాయి. దీంతో బకాయిల్లో కొంత చెల్లిస్తారని గుత్తేదారులు ఎదురుచూశారు. కానీ ఆ మొత్తాన్ని ఏపీ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జమ చేసింది. 5శాతం వడ్డీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ కార్పొరేషన్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను మళ్లిస్తోంది. అందువల్ల ఇప్పుడప్పుడే ఆ నిధులు వెనక్కి వచ్చే అవకాశంలేదని చెబుతున్నారు. ఇవన్నీ తెలిసినా నిధులు జమచేయడంపై విమర్శలు వస్తున్నాయి. బకాయిలు ఇవ్వకుండా డబ్బులు ఎలా జమచేస్తారని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేడు ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.