ETV Bharat / city

ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకం - ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ వార్తలు

మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వీసీ, ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్ ప్రస్తుతం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా..ఆ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

RP Thakur
RP Thakur
author img

By

Published : Jan 13, 2021, 11:21 AM IST

Updated : Jan 13, 2021, 3:22 PM IST

రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్​కు చెందిన ఠాకూర్ ..గతంలో ఏసీబీ డీజీగా పనిచేశారు.

గత ప్రభుత్వ హయాంలో డీజీపీగా ఉన్న ఆయనను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఇప్పుడు ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించిన ప్రభుత్వం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

RP Thakur appointed as RTC MD
సీఎం జగన్​కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆర్పీ ఠాకూర్

సీఎంతో మర్యాదపూర్వక భేటీ

ఆర్టీసీ ఎండీగా నియమితులైన ఆర్పీ ఠాకూర్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనను ఆర్టీసీ ఎండీగా నియమించటంపై సీఎంకు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన

Last Updated : Jan 13, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.