ETV Bharat / city

గతుకుల గమ్యం.. ఇంకెన్నాళ్లీ ప్రయాణం?

రహదారుల పనులకు వేసవి కాలం ఎంతో కీలకమైంది. ఈ సమయంలోనే రహదారుల పునరుద్ధరణ చేపట్టాలని ప్రభుత్వం భావించగా, గుత్తేదారులు అత్యధిక జిల్లాల్లో టెండర్లు వేయలేదు. బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడం, గతంలో చేసిన పనులకు బిల్లులు వస్తాయా? రావా అనే సందేహంతో పలు జిల్లాల్లో ముందుకు రాలేదు. ఇంతలో వేసవి ముగిసి, వర్షాలు కురిసే సమయం వచ్చేసింది. దీంతో మళ్లీ వర్షాకాలం ముగిసే వరకూ గతుకుల రహదారులు, గుంతలు పూడ్చిన రహదారులపైనే వాహనదారులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతుకుల గమ్యం!
గతుకుల గమ్యం!
author img

By

Published : Jun 2, 2021, 6:33 AM IST

రాష్ట్రంలో గత రెండేళ్లలో అనేక రహదారులు దెబ్బతినడంతో, తాత్కాలికంగా గుంతలు పూడ్చారు. తర్వాత రాష్ట్ర రహదారుల్లో 2,726 కి.మీ., జిల్లా ప్రధాన రహదారుల్లో 5,243 కి.మీ. కలిపి మొత్తం 7,969 కి.మీ.ను రూ.2,205 కోట్లతో పునరుద్ధరించేందుకు మార్చిలో ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీకి అనుమతించింది. ఈ మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ)కి అవకాశం కల్పించారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 చొప్పున వసూలు చేస్తున్న రహదారి పన్నుతో బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించే వీలు కల్పించారు. తీరా రహదారుల పనులకు టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.

మూడు జిల్లాల్లోనే స్పందన

మొత్తం 1,123 పనులకు టెండర్లు పిలిచారు. కేవలం కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే గుత్తేదారులు టెండర్లు వేశారు. మిగిలిన జిల్లాల్లో దాదాపు ఎక్కడా టెండర్లు దాఖలు కాలేదు. విజయనగరం జిల్లాలో మాత్రం అరకొర టెండర్లు వచ్చాయి. మొత్తంగా దాదాపు 300 పనులకు మాత్రమే టెండర్లు దాఖలైనట్లు తెలిసింది. రుణం తీసుకునే బ్యాంకుల నుంచే నేరుగా బిల్లులు చెల్లిస్తామని, వీటిలో జాప్యం ఉండదని అధికారులు, గుత్తేదారులకు నచ్చజెప్పినా వారు ఆసక్తి చూపలేదు. రెండోసారి టెండర్ల గడువు ముగిసినా సరే కోస్తా జిల్లాల్లోని గుత్తేదారులంతా ఒకేమాటపై టెండర్లు వేయకుండా ఉన్నారు.

బకాయిల సంగతేమిటి?

కొవిడ్‌ ప్రభావం, బ్యాంకు రుణం ఇంకా మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు టెండర్లు వేయలేదని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు చెబుతుండగా.. గుత్తేదారుల వాదన మరోలా ఉంది. గతంలో చేసిన పనులకు దాదాపు రెండేళ్లపాటు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. కొన్ని చోట్ల చెల్లించినా ఇంకా బకాయిలు ఉన్నాయని.. నగదు రొటేషన్‌ లేక పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.