Acharya song vivadam: 'ఆచార్య' సినిమాలోని పాటపై ఆర్ఎంపీలు, పీఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఆ సినిమాలో వైద్య వృత్తిని కించపరిచే విధంగా 'ఏడేడో నిమరొచ్చని కుర్రాల్లే ఆర్ఎంపీలు అవుతున్నారే..' అనే పాట ఉందని.. తక్షణమే ఆ పాటను మార్చకుంటే ఆచార్య సినిమా నిర్మాతపై కేసు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ తెలిపారు.
జనగామ జిల్లా పోలీసు అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పాట రాసిన రచయితపై, దర్శకునిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ నిపుణులను కలిసి వారి సలహాలు కూడా తీసుకున్నామన్నారు. వెంటనే పాటను మార్చి వైద్యులకు క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
చిరు తనయుడితో కలిసి 'ఆచార్య'
Chiranjeevi New Movie Acharya: అగ్ర కథానాయకుడు చిరంజీవి సినిమా అంటే అదో పెద్ద పండగ. అలాంటిది తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తుంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దేవాదాయశాఖలో జరిగే అవినీతి, అక్రమాల నేపథ్యంలో సినిమా సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు కలిసి నటించారు. మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో చిరంజీవి తెరపై అతిథిగా కాసేపు మెరిస్తే.. ఖైదీ నెంబర్ 150లో రామ్‌చరణ్ గెస్ట్‌గా తండ్రితో కలిసి స్టెప్‌లు వేశారు. ఫిబ్రవరి 4న 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటివలే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' నుంచి 'సానా కష్టం' పాట లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్‌లో మరోసారి తన స్టైల్, గ్రేస్‌తో అదరగొట్టారు చిరు. రెజీనాతో కలిసి వేసిన స్టెప్పులు ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇన్నేళ్లయినా చిరులో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని సంబరపడిపోతున్నారు అభిమానులు. ఈ పాటలోనే ఓ చరణంలో 'ఏడేడో నిమరొచ్చని కుర్రాల్లే ఆర్ఎంపీలు అవుతున్నారే..' అని ఉంది. దీనిపై ఆర్ఎంపీలు, పీఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: