రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినవారు జులై నెల పింఛను కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆగస్టు 5వ తేదీ వచ్చినా.. వారికి పింఛను అందలేదు. నెల మొదట్లో తొలి రెండు రోజులు సెలవులు కావడం వల్ల సోమవారం జీతాలు, పింఛన్లు అందుతాయని అంతా ఎదురుచూశారు. అయితే వీరికి బుధవారం నాటికీ పెన్షన్ నగదు అందలేదు. చాలినంతగా నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతున్నాయని సమాచారం.
ఇదీ చూడండి..