Amaravati Municipality: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై గ్రామ సభలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన 6వ రోజు శాఖమూరులో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 38 మంది హాజరుకాగా... 37 మంది అమరావతి మున్సిపల్ ఏర్పాటును వ్యతిరేకించారు. ఒక్కరు మాత్రమే మున్సిపాలిటీకి అనుకూలం అని చెప్పారు. గ్రామ సభ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. వ్యవసాయ కూలీలకు పనులు లేవని.. ఉపాధి కరవైందని అధికారుల దృష్టికి తెచ్చారు. మున్సిపాల్టీ ఏర్పాటు వల్ల ఒరిగేది ఏమిలేదని శాఖమూరు వాసులు అభిప్రాయపడ్డారు. రాజధానిలోని 29 గ్రామాలను కలిపి కాకుండా గ్రామాలను ముక్కలు ముక్కలుగా చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: