ETV Bharat / city

వైకాపాకూ తప్పని అంతర్గత పోరు.. మున్సిపల్ బరిలో భారీగా రెబెల్స్ - ap municipal elections

నగర, పుర బరిలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. వారికి టికెట్ రాకపోవడంతో.. ఎన్నికల్లో తిరుగుబాటుదారులుగా పోటీ చేస్తున్నారు. అధిష్ఠానం బుజ్జగింపులతో కొందరు నామినేషన్లే వేయలేదు. మరికొందరు రెబల్స్​గా గట్టీ పోటీ ఇస్తున్నారు.

rebel candidates in ysrcp
వైకాపాలో ఎక్కువైన ఇంటి పోరు
author img

By

Published : Mar 7, 2021, 8:16 AM IST

నగర, పురపాలికల ఎన్నికల్లో అధికార వైకాపాలో ఇంటి పోరు తప్పడం లేదు. టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా పలువురు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల విభేదాలతో తమ అనుయాయులకు పార్టీ బి.ఫారాలు రాకపోవడంతో వారిని కొందరు నాయకులే స్వతంత్రులుగా పోటీలో కొనసాగిస్తున్నారు. కడప నగర పాలక సంస్థలో 3 డివిజన్లలోనే 10 మంది, విశాఖపట్నం నగరపాలక సంస్థలో ముగ్గురు తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. కొందరిని సంప్రదింపులతో పోటీ నుంచి విరమింపజేయించినా కొన్ని చోట్ల రెబల్స్‌ కొనసాగుతున్నారు.

కడప జిల్లా బద్వేలులో 25 స్థానాల్లోనూ, ప్రొద్దుటూరులో 20 మంది వరకు, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలో 25 మంది, చీరాలలో 28 మంది, అనంతపురం జిల్లా హిందూపురంలో 15 మంది రంగంలో ఉన్నారు. తాడిపత్రిలోని ఒక వార్డులో అధికార, తిరుగుబాటు అభ్యర్థి నడుమే పోటీ జరుగుతోంది. గుంతకల్లు, మడకశిరలో నలుగురి చొప్పున, కృష్ణా జిల్లా విజయవాడ నగర పాలక సంస్థలో ఇద్దరు, నందిగామలో ముగ్గురు, తిరువూరు, ఉయ్యూరులో ఒక్కొక్కరి చొప్పున పోటీలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇద్దరు, ఇచ్ఛాపురంలో నలుగురు, తూ.గో. జిల్లాలో పిఠాపురం-6, పెద్దాపురం-6, గోల్లప్రోలు-4, మండపేట-1, ముమ్మిడివరం-1, ఏలేశ్వరం-2, రామచంద్రాపురం-2 చొప్పున, చిత్తూరు కార్పొరేషన్‌లో నలుగురు బరిలో నిలిచారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 5 వార్డుల్లో రెబల్స్‌ ఉన్నారు. వీరిలో తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు, వైకాపా నేత సన్యాసిపాత్రుడి అనుచరులు ఇద్దరున్నారు.

ఇదీ చూడండి.

'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.