ETV Bharat / city

తెలంగాణ : సంగారెడ్డిలో బాలికపై అత్యాచారయత్నం - సంగారెడ్డి జిల్లా వార్తలు

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటేల్​గూడలో ఓ బాలికపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు.

rape-attempt-on-girl-in-sangareddy
తెలంగాణ : సంగారెడ్డిలో బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Dec 2, 2020, 8:17 PM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం పటేల్ గూడలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. సూర్యోదయ కాలనీలో నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసే రమేశ్​ అనే మృగాడు మంగళవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రమేశ్ తన తోటి కూలీ కుమార్తె నోట్లో గుడ్డలు కుక్కి... అత్యాచారానికి యత్నించాడు.

బాలిక కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. వారిని చూసిన రమేశ్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు అమీన్‌పూర్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... వైద్య పరీక్షల కోసం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్​పూర్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పాలనా అనుమతులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.