ETV Bharat / city

భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం - Sri Sita Rama Kalyana Mahothsavam

తెలంగాణలోని భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కొద్దిమంది సమక్షంలోనే నిరాడంబరంగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో.. మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌... స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎప్పుడూ వైభవోపేతంగా జరిగే జగదభిరాముడి కళ్యాణాన్ని నేరుగా చూడలేకపోయిన భక్తులు.. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

bhadradhi ramuni kalyanam
భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం
author img

By

Published : Apr 21, 2021, 2:09 PM IST

భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం

జగాలను ఏలిన జగదేకవీరుడికి, జగన్మాత సీతమ్మకు జరిగే కల్యాణం విశ్వకల్యాణమే. ఈ పెళ్లి.. భారతీయ దాంపత్య జీవనానికి ప్రతీక. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న కల్యాణ మహోత్సవం వేళ...ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం... రాములోరి కల్యాణంపైనా తీవ్ర ప్రభావం చూపింది. భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణల మధ్య వైభవోపేతంగా సాగే ఈ కల్యాణవేడుక... గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా జరిగింది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో భక్తులు లేకుండానే జగదానంద కారకుడి కళ్యాణాన్ని నిర్వహించారు. దశాబ్దాల కాలం నుంచీ మిథిలా మైదానంలో జరిగే సీతారాముల వారి పెళ్లి ఈ సారి.. ప్రధాన ఆలయంలోని నిత్య కల్యాణం జరిగే మండపంలోనే కేవలం వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో జరిగింది.

ఊరేగింపు నడుమ

సుందరంగా ముస్తాబైన నిత్యకల్యాణ మండపానికి... దేవతామూర్తులను వేదమంత్రోచ్చరణల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తానీషా కాలం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ... స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఆభరణాలు సమర్పించారు.

రక్షాబంధనం

వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు. అనంతరం కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత... రక్షా బంధనం నిర్వహించి యోక్ర్తధారణ చేశారు. దర్బలతో ప్రత్యేకంగా అల్లినతాడుని... సీతమ్మవారి నడుముకి బిగించారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి... స్వామి వారికి యజ్ఞోపవితరణ చేసి, కన్యావరుణ నిర్వహించి... తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ.. తగిన వధువని నిర్ణయించి... ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు.

సీతమ్మవారికి మాంగల్యధారణ

కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా... చూర్ణికను పఠించారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రోచ్చరణల నడుమ అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా... వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. ఇది శుభ ముహూర్తం. జగత్ కల్యాణ శుభసన్నివేశం. ఆ కమనీయ వేడుకను కనులారా వీక్షించిన భక్తులు... తన్మయత్వం పొందారు.

శుక్రవారం శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

ఇదీ చూడండి : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.