అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని వై.టి చెరువు గ్రామానికి చెందిన రమాదేవి, మహేష్ దంపతులకు మొదటి కాన్పులోనే ముగ్గురు శిశువులకు జన్మించారు. సాధారణంగా ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసం పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన వెంటనే సిజెరియన్ తో ఆపరేషన్ నిర్వహిస్తుంటారు. అలాంటిది స్థానిక స్వప్న నర్సింగ్ హోమ్ లోని మహిళా వైద్యురాలు రమణ.. సాధారణ కాన్పులోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు జన్మనిచ్చే విధంగా చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు.
మొదటి నుంచి ఆమెకు ముగ్గురు పిల్లలు కడుపులో పెరుగుతున్న అంశం దృష్టిలో ఉంచుకుని నాలుగవ నెలలోనే అబార్షన్ లాంటివి జరుగకుండా utres కు చిన్న చికిత్స చేశాము. ఏడవ నెల నుంచి సాధారణ కాన్పు కోసం చికిత్స అందించాము. ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించడం అరుదు. అదికూడా నార్మల్ డెలివరీ కావడం తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని ఐతే బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాము. ముగ్గురు శిశువుల్లో ఒక శిశువుకు ఆయాసం ఉండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందజేస్తున్నాము. : డాక్టర్ రమణ
సాధారణ కాన్పు కావడంపై... తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఆత్మహత్య పేరిట యువతిని చంపేందుకు యత్నం