మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, తేజ సజ్జ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్‌తో పాటు చిరంజీవి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు స్వామినాయుడు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన పలువురిని నిర్మాత దిల్‌రాజు, సాయితేజ్లు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసిన సాయితేజ్.. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానుల ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.