సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్ వాహనాలు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ మోసాలకు తెరలేపారు. అలాగే అందమైన అమ్మాయిల ఫొటోలు, న్యూడ్ వీడియోస్ పంపుతూ బ్లాక్ మెయిల్ దందా కొనసాగిస్తున్నారు.
రాజస్థాన్‌లోని అవెర్ జిల్లాకు చెందిన పది మంది ముఠా సభ్యులను పీటీ వారెంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. గతంలో రాజస్థాన్ పోలీసుల చేతిలో అరెస్టైన ఈ ముఠా సభ్యులు ఇప్పటికే అవెర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.
నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..
హైదరాబాద్‌లో తక్కువ ధరకే వాహనాలను అందిస్తామంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎల్ఎక్స్లో వాహనాలు విక్రయిస్తామంటూ పలువురిని మోసగించినట్లు పేర్కొన్నారు. యువకులకు మహిళల నగ్న వీడియోలు పంపుతున్న ముఠా సభ్యులు.. వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. రాజస్థాన్‌లోనూ సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:
Raid on Brothel: చిలకలూరిపేటలో.. వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి