బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వానతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు, వివిధ పనులకు వెళ్లే ప్రజలు తడిసి ముద్దయ్యారు. ట్యాంక్‌బండ్‌పై కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
ఇదీ చూడండి. అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం