ETV Bharat / city

మెడికల్ సీటు సాధించిన విద్యార్థినిని అభినందించిన రైల్వే ఎస్పీ

author img

By

Published : Jan 19, 2021, 12:04 PM IST

ఆమె ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ కుమార్తె. కష్టపడి చదివి ఉచిత మెడికల్ సీటు సాధించింది. తండ్రితో కలిసి రైల్వే ఎస్పీ అనురాధను కలిసింది. వైద్య విద్యలో సీటు సాధించిన ఆమెను ఎస్పీ అభినందించి శాలువాతో సత్కరించారు. రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

railway sp
మెడికల్ సీటు సాధించిన విద్యార్థినిని అభినందించిన రైల్వే ఎస్పీ అనురాధ

తెలంగాణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉచిత మెడికల్ సీటు సాధించిన కానిస్టేబుల్ కుమార్తెను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అనురాధ అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

రైల్వే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోవింద్ కుమార్తె అషికాకు.. నీట్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో 50వేలు, రాష్ట్రంలో 1,100 ర్యాంకు వచ్చింది. ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్‌లో మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అషికా ఉచిత సీటు సంపాదించింది.

అభినందనీయం..

తన తండ్రితో కలిసి ఎస్పీ అనురాధను సోమవారం కలిశారు. ఎస్పీ ఆమెను శాలువాతో సత్కరించారు. వైద్య విద్యతో ఎంతో మందికి సేవ చేసే అవకాశం రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి, శేఖర్ పాల్గొని ఆమెను అభినందించారు.

ఇదీ చూడండి: శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి చూపుతున్న మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.