ETV Bharat / city

RAIDS ON MASSAGE CENTERS: మసాజ్, స్పా సెంటర్లపై టాస్క్​ఫోర్స్ దాడులు.. 13 మంది అరెస్టు - RAIDS ON MASSAGE CENTERS latest updates

Raids on Spa Centers Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్.. మసాజ్, స్పా సెంటర్లపై దాడులు చేసింది. 13 మందిని అరెస్టు చేసి.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు తరలించారు. మసాజ్, స్పా సెంటర్లను సీజ్ చేశారు.

RAIDS ON MASSAGE CENTERS
RAIDS ON MASSAGE CENTERS
author img

By

Published : Nov 23, 2021, 1:07 PM IST

మసాజ్, స్పా సెంటర్లపై టాస్క్​ఫోర్స్ దాడులు.. 13 మంది అరెస్టు

Raids on Spa Centers Hyderabad: హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని మసాజ్, స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు చేసింది. నారాయణ గూడ, రాంగోపాల్ పేట్ ఠాణాల పరిధిలోని మూడు స్పా సెంటర్లపై దాడి చేసిన టాస్క్‌పోర్స్‌ పోలీసులు.. 13 మందిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించి మసాజ్, స్పా సెంటర్లను సీజ్ చేశారు.

Raids on Hyderabad massage Centers: అటు.. ఉత్తర మండల పరిధిలోని మహంకాళి, కార్ఖానా , మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. నలుగురు స్పా నిర్వాహకులతో పాటు 12 మంది మహిళలు, ఐదుగురు పురషులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా, సీసీ కెమెరాలు లేకుండా, మసాజ్ సెంటర్‌కు వచ్చే వారి వివరాలు నమోదు చేసుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Sex racket in Spa centers: మరోవైపు చెన్నైలోని 151 మసాజ్, స్పా సెంటర్లపై ఆ రాష్ట్ర పోలీసులు దాడి చేశారు. కొంతమంది సెక్స్​ రాకెట్ నడిపిస్తున్నారనే పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందిన పోలీసులు 151 మసాజ్, స్పా సెంటర్లపై రైడ్ (​raids on Spa centers Chennai) చేశారు. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న పలువురిని అరెస్టు చేశారు. చెన్నైలో మసాజ్ సెంటర్ల నిర్వహణకు చాలా మంది అధికారిక అనుమతులు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది అక్రమంగా ఈ కేంద్రాల్లో వ్యభిచారం నడిపిస్తున్నారు. ఆదివారం రాత్రి తియాగారాయ నగర్​లో 20, కిల్​పాక్​లోని 6 మసాజ్ సెంటరల్లో డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్​ నేతృత్వంలో పోలీసులు రైడ్ చేశారు.

ఇదీ చదవండి :

bus accident: డివైడర్​ను ఢీకొట్టిన బస్సు...ఏడుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.