ETV Bharat / city

అమ్మకానికి మహవీర్ హరిణ జాతీయ పార్క్​!

తెలంగాణలోని హైదరాబాద్​ శివార్లలో ఉన్న మహవీర్ జింకల పార్క్​ భూమి అమ్మకంపై కలకలం రేగుతోంది. పార్క్​ పరిధిలోని 2,400 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు స్టాంప్​ పేపర్​ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్న నోటరీ పేపర్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

property issue over mahaveer national park
అమ్మకానికి మహవీర్ హరిణ జాతీయ పార్క్​!
author img

By

Published : Feb 20, 2020, 6:45 PM IST

తెలంగాణలోని హైదరాబాద్​ పట్టణ శివారులో విజయవాడ హైవేకు ఆనుకుని ఉన్న మహవీర్​ హరిణి వనస్థలి పార్క్​ను కొందరు అమ్మకానికి పెట్టడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర అటవీ శాఖ చెందిన 4వేల ఎకరాల్లో 1994 సంవత్సరంలో జింకల పార్క్​ను నిర్మించగా దానికి జాతీయ పార్క్​ హోదా కల్పించారు. 1996లో దానికి ప్రహరీని నిర్మించారు. అప్పటికే అందులోని 2,400 ఎకరాల భూమి మాదేనంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటవీ అధికారులకు, పిటిషనర్లకు మధ్య జరిగిన వివాదంలో ధర్మాసనం ఆ స్థలం అటవీ శాఖకే చెందుతుందని తీర్పునిచ్చింది.

తాజాగా 2019 ఆగస్టులో యూసఫ్​ ఖాన్​, వాసం తులసమ్మ అలియాస్​ సుల్తానా పేరుపై సర్వే నెం 7లోని 2400 ఎకరాలు తమవేనంటూ స్టాంప్​ పేపర్లు సృష్టించారు. వీటిపై పూర్తి హక్కుదారులం తామేనంటూ పేర్కొన్నారు. వీటిలోని కొంత భూమి చొప్పున అమ్మకానికి పెడుతున్న స్టాంప్ పత్రాలు ప్రస్తుతం సర్వత్రా కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్​ న్యూట్రిషన్​ పార్క్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.