Pregnant problems: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు కురవడంతో ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగుతున్నాయి. వారికి సరైన రహదారులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇవాళ ఓ గిరిజన గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ సంఘటన కరగకూడ మండలం ఆశ్వాపురంపాడులో చోటుచేసుకుంది.
అశ్వాపురం పాడు గ్రామానికి చెందిన నిండు గర్భిణీ దేవికి సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. నడక మార్గం సైతం సరిగా లేకపోవడంతో నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఓ కర్రకు తాళ్లతో కుర్చీని కట్టి గర్భిణీని కూర్చోబెట్టి చెరువును దాటించారు. ఆ తర్వాత బురదమయంగా ఉన్న నడక మార్గంలోనే సుమారు రెండు మైళ్ల దూరం నడిచి గర్భిణీని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఆశా కార్యకర్త సహకారంతో అంబులెన్స్‌లో కరకగూడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గర్భిణీకి ప్రసవం కష్టంగా ఉండడంతో మరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు.
ఇవీ చదవండి: