ETV Bharat / city

ఉదయం పూట నడిస్తే... రాత్రి నిద్ర పడుతుందట..!

ఉదయం పూట నడవటం వల్ల... రాత్రి నిద్ర బాగా పడుతుందట.. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బైపాస్ సర్జరీ చేయించుకున్నవారికి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం ఓసారి చదవండి.

precautions
precautions
author img

By

Published : Aug 11, 2020, 8:18 PM IST

గుండె బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలామందికి సరిగా నిద్ర పట్టదు. రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యమూ తగ్గుతుంటుంది. ఆర్నెల్లు దాటినా నిద్ర సమస్య తగ్గకపోతే గుండె ఆరోగ్యం దెబ్బతినొచ్ఛు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్ఛు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉదయం పూట నడవటం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది రాత్రిపూట నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

బైపాస్‌ సర్జరీ తర్వాత నిద్ర విషయంలో వ్యాయామం ప్రభావం మీద గతంలోనూ అధ్యయనాలు జరిగాయి. అయితే ఇది రోజువారీ పనుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది అంచనా వేయలేకపోయాయి. అందుకే కైరో యూనివర్సిటీ పరిశోధకులు నిద్ర, రోజువారీ పనుల సామర్థ్యంపై వ్యాయామం ప్రభావం మీద దృష్టి సారించారు. కొందరికి రోజుకు 30-45 నిమిషాల సేపు ట్రెడ్‌మిల్‌ మీద నడవమని సూచించగా.. మరికొందరికి ట్రెడ్‌మిల్‌ నడకతో పాటు బరువులెత్తే వ్యాయామాలూ చేయాలని చెప్పారు.

నడక మాత్రమే ఎంచుకున్నవారిలో మరింత మెరుగైన ఫలితం కనిపించటం గమనార్హం. అందువల్ల బైపాస్‌ అనంతరం నిద్ర పట్టక సతమతమయ్యేవారు ఉదయం పూట నడక వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు చేయటమే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో మెలటోనిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది.

ఇదీ చదవండి:

పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.