ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఒకరోజు సమగ్ర విచారణ జరుపుతామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. తదుపరి ఆదేశాల వరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కనబెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. ఈ అంశంపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఇదీ చదవండి: విశాఖ, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిలిచిన పంచాయతీ పోరు!