రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నెమ్మదిగా జోరందుకుంటోది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 66.60 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 77.20 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 61.62 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా...
శ్రీకాకుళంలో 62.07, విజయనగరంలో 77.20, విశాఖ 73.30, తూర్పు గోదావరి జిల్లా 64.04, పశ్చిమ గోదావరి జిల్లా 63.29, కృష్ణా 62.82, గుంటూరు 62.87, ప్రకాశంలో జిల్లాలో 61.79 శాతం నమోదైంది. నెల్లూరులో 61.62 శాతం పోలింగ్ నమోదు కాగా... చిత్తూరులో 66.62, కడప 69.93, కర్నూలులో 68.62, అనంతపురంలో 71.65 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
ఇదీ చదవండి