మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మంగళవారం అల్లరిమూకలు దాడి చేయడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తెదేపా ముఖ్యనేతల ఇళ్లపై దాడులకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన ఇంటికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో నారావారిపల్లికి చేరుకుని భద్రత చర్యలను తీసుకున్నారు.
ఇదీ చదవండి : రేణిగుంటలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ.. పరస్పరం రాళ్ల దాడి