చనిపోయిన తర్వాత ఎవరైనా సంస్మరణ సభ జరుపుకుంటారని మావోయిస్టు ఆర్కే భార్య శిరీష (Maoist RK wife Shirisha) అన్నారు. తాను అదే విధంగా ఆర్కే సంస్మరణ సభ నిర్వహించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని తెలిపారు. 2004లో ఆర్కే చర్చలకు వచ్చినపుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫొటోలు జ్ఞాపకాలుగా దాచుకున్నట్లు చెప్పారు. 2010లో అరెస్ట్ అయినపుడు వచ్చిన కథనాలను కూడా దాచుకున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటిని కలిపి ఆర్కే జ్ఞాపకాలతో పుస్తకం (Maoist RK Book) రాయాలని భావించినట్లు వివరించారు. హైదరాబాద్ సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో శిరీష (Maoist RK wife Shirisha) మీడియాతో మాట్లాడారు.
'ఆర్కే జ్ఞాపకాలతో రాసిన పుస్తక ముద్రణను పోలీసులు అడ్డుకున్నారు. రెండ్రోజుల క్రితం ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి చేశారు. ముద్రణ దశలోనే పుస్తకాలను ఎత్తుకెళ్లారు. ఆ పుస్తకాలను తిరిగివ్వాలి. పుస్తకావిష్కరణకు అవకాశం కల్పించాలి.'
-శిరీష, ఆర్కే భార్య
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కుదరలేదు
పోరాటంపై ప్రజలకు అవగాహన లేకపోయినా పర్వాలేదని... కానీ ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి ఆలోచించాలని ప్రొ.హరగోపాల్ అన్నారు. రాజకీయాలు ఎంత దిగజారినా మానవ విలువలు ఉండాలని పేర్కొన్నారు. రాజకీయం అంటే ఇచ్చుకోవటం, పుచ్చుకోవడం కాదని చెప్పారు. మనిషి చనిపోయాక మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే అని... వాటిని సమాజంతో పంచుకోవాలని ఆర్కే భార్య (Maoist RK Book) అనుకున్నారని తెలిపారు. శాంతి చర్చలకు ఆర్కే వచ్చినప్పుడు తాను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా చర్చలకు ప్రయత్నించగా కుదరలేదని... అనంతరం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల ద్వారా ఆర్కే అందరికి సూపరిచితులు అయ్యారని వెల్లడించారు.
అప్పుడు మావోయిస్టు అజెండానే మత అజెండా అన్నారు
అనారోగ్యంతో చనిపోయిన ఆర్కే జ్ఞాపకాలను తెలియజెప్పే అవకాశం ఇప్పుడు లేదని ప్రొ.హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ దశలో మావోయిస్టు అజెండానే తమ అజెండా అని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక అన్ని మారిపోయాయని విమర్శించారు. మానవీయ విలువలు లేకుండాపోయాయని అన్నారు. ఇప్పటికైనా ఈ ఫాసిస్ట్ ధోరణి మార్చుకొని ఆర్కే పుస్తకం (Maoist RK Book) ఆవిష్కరించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ... పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అడవిలోనే ఆర్కే అంత్యక్రియలు.. ఆయన చివరి లేఖలో ఏముందో తెలుసా?