ETV Bharat / city

యూట్యూబర్​తో కలిసి పబ్​కు వెళ్లారు.. కొబ్బరి బొండాల్లో మద్యం తాగారు.. - hyderabad road accidents

Gachibowli Accident: తెలంగాణలోని హైదరాబాద్​ గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొబ్బరి బొండాల్లో మద్యం కలిపి తాగడం వల్లే... కారు అదుపుతప్పి ప్రమాదానికి కారణమయ్యిందని పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనలో యువతితో సహా.. రోడ్డు పక్కన ఉన్న మరో మహిళ బలయ్యింది.

ప్రముఖ యూట్యూబర్‌, జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి

author img

By

Published : Mar 19, 2022, 4:34 PM IST

Gachibowli Accident : తెలంగాణలోని హైదరాబాద్​ గచ్చిబౌలిలో మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తేల్చారు. ప్రమాదానికి ముందు.. రోహిత్​, అతని స్నేహితులు ఫుల్లుగా మద్యం తాగి జల్సా చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. హోలి వేళ మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో... స్నేహితులతో కలిసి రోహిత్‌ మద్యాన్ని ముందే కొనుగోలు చేశాడు. వాటిని అనుమానం రాకుండా.. 8 కొబ్బరి బొండాలలో కలపాడు. గాయత్రి, మరో ఐదుగురు రోహిత్ స్నేహితుడి గదిలో పార్టీ చేసుకున్నారు.

ప్రముఖ యూట్యూబర్‌, జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి
ప్రముఖ యూట్యూబర్‌, జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి

కొబ్బరి బొండాల్లో మద్యం

పార్టీ అనంతరం అందరూ కలిసి మద్యం కలిపిన కొబ్బరి బొండాలను తీసుకుని.. కారులో పెట్టుకొని ప్రిజమ్ పబ్​కు వెళ్లారు. స్నేహితులు అంతా కలిసి సందడిగా గడిపారు. ఆ తర్వాత వేడుకల నుంచి కారు వద్దకు వచ్చి కొబ్బరి బొండాల్లో ఉన్న మద్యం సేవించారు. 8 కొబ్బరిబొండాల్లో ఆరింటిని తాగారు. కారులోనే రెండు కొబ్బరిబొండాలు ఉంచుకుని.. వెళ్తుండగా.. మద్యం మత్తులో రోహిత్‌ డివైడర్‌ను ఢీకొట్టాడు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కారులో ఉన్న మద్యం కలిపిన కొబ్బరి బొండాలను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం వీటిని.. ల్యాబ్‌కు పంపించారు.

ఏం జరిగిందంటే?

ప్రముఖ యూట్యూబర్‌, జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి.. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నేహితుడు రోహిత్​తో కలిసి సైబరాబాద్​లోని విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. రోహిత్​కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. పలువురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.