ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనీఖీలు.. భారీగా మద్యం, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

author img

By

Published : Jul 10, 2021, 11:34 AM IST

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు దాడులు చేపట్టారు. భారీ స్థాయిలో మద్యం, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసకున్నారు.

police
భారీగా మద్యం, గుట్నా ప్యాకెట్ల పట్టివేత

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు తనీఖీలు చేపట్టారు. పెద్ద మొత్తంలో మద్యం, గుట్నా ప్యాకెట్లను స్వాధీనం చేసకున్నారు.

కర్నూలు జిల్లాలో...

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎమ్మిగనూరు మండలం.. సిరాలదొడ్డి వద్ద పోలీసులు పట్టుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కూరగాయల లారీని సీజ్​ చేశారు. తెలంగాణకు చెందిన వినోద్ కుమార్, ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ కు చెందిన వీరేశ్, మహాదేవను అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో...

  • విశాఖ నుంచి తమిళనాడుకు అక్రమంగా కారులో తరలిస్తున్న 220 కిలోల గంజాయిని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి తమిళనాడులోని మధురైకి కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద నిఘా పెట్టారు. ఏపీ 28 డీఎఫ్ 1323 వోక్స్ వ్యాగన్ కారులో ఉన్న 220 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
  • రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అత్యంత కీలకమైనదని దాచేపల్లి తహశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ అన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న పొందుగుల చెక్​పోస్ట్​ను సందర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మద్యం, మట్కా, ఇతర అక్రమ రవాణా లను అరికట్టడంలో చెక్ పోస్ట్ సిబ్బంది పాత్ర కీలకమైంది అన్నారు. 24 గంటలు విధులు నిర్వహించే చెక్ పోస్ట్ సిబ్బంది నిరంతరం జాగ్రత్తతో వ్యవహరించినప్పుడే అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని చెప్పారు.

కృష్ణా జిల్లాలో...

  • గన్నవరంలో భారీగా నిల్వ ఉంచిన మత్తు పదార్థ గోదాంలపై టాస్క్ ఫోర్స్, ఎస్ఈబీ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒకే వ్యక్తికి చెందిన మూడు గౌడోన్ లపై ఏకకాలంలో తనీఖీలు చేసి, ఖైనీ ప్యాకెట్లతో పాటు సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
  • మరో ఘటనలో.. మద్యం విక్రయదారుడిని ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఆత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నమారు. తనీఖీల్లో తొమ్మిది మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
  • రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని వీరులపాడు మండలంలోపెద్దాపురం జయంతి సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్​ చేసి 500 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి ఒక వ్యక్తి కంచికచర్ల మండలం మోగులూరు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • మైలవరంలో పంటపొలాల్లో రూ. లక్షా 54 వేల విలువ చేసే తెలంగాణ మద్యాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు పట్టకున్నారు. తెలంగాణ మద్యంతో పంటపొలాల్లో ఉన్న వ్యాన్​ను, 1125 మద్యం బాటిళ్లు ద్విచక్ర వాహనం, రూ. 3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

  • మేఘాలయ నుంచి ఉండ్రాజవరం మండలానికి అక్రమంగా రవాణా అవుతున్న రూ.24 లక్షల విలువైన 1830 మద్యం సీసాలను జిల్లాఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. కోళ్ల దాణా లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను సత్యవాడ రైల్వే గేటు వద్ద గుర్తించారు.
  • తణుకు పట్టణానికి చెందిన కల్లూరి రామకృష్ణ, బాలాజీ, లారీ డ్రైవర్​పై కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్​ను అరెస్టు చేయగా రామకృష్ణ బాలాజీ లు పరారీలో ఉన్నారని ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోబోయిన సిబ్బందిపై.. పెట్రోల్​తో దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.