ETV Bharat / city

పాఠశాలలో పోలీసులు... ఆరుబయట విద్యార్థులు..!

రాజధాని గ్రామాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు.. ఆ పాఠశాలే వసతిగా మారింది. విద్యార్థులకు తరగతులు చెప్పేందుకు.. ఆరు బయట ప్రాంతమే దిక్కయింది. మందడంలోని ఆ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై... పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులు జరగాల్సిన చోట పోలీసుల బసేంటని ప్రశ్నించినందుకు... ఛానళ్లకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. కొందరు మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు.

author img

By

Published : Jan 23, 2020, 10:37 AM IST

Updated : Jan 23, 2020, 11:46 AM IST

Police at school outdoors students at mandadam
పాఠశాలలో పోలీసులు... ఆరుబయట విద్యార్థులు
పోలీసులు పాఠశాల గదుల్లో ఉండడం వల్ల ఆరు బయట విద్యార్థులు

తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు చెట్ల కిందకు చేరారు. విధుల్లో ఉన్న పోలీసులు గదుల్లో చేరారు. అన్ని వసతులు ఉన్నా... విద్యార్థులు ఆరు బయట చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ తుళ్లూరు మండలం మందడం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం కనిపించిన దృశ్యం. గత పది రోజులుగా విధుల్లో ఉన్న పోలీసులకు ఈ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం నుంచి బడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పోలీసులు మాత్రం ఆ గదులను ఖాళీ చెయ్యలేదు. ఇక్కడున్న 20 గదుల్లో ఏడింటిలో ఇంకా బస చేస్తున్నారు. దీనిపై కొందరు గ్రామస్థులు మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని పాఠశాలకు వెళ్లారు. కొన్ని గదులకు తాళం వేయగా... మరికొన్ని తెరిచి ఉన్నాయి. వాటిల్లో తాడు, బల్లలపై ఉతికిన దుస్తులు ఆరేసి ఉన్నాయి. ప్రార్థన జరిగే చోట, క్రీడా మైదానంలోనూ ఇదే పరిస్థితి. తరగతులు జరుగుతున్నా ఏ విధంగా బస చేస్తారని గ్రామస్థులు పోలీసులను నిలదీశారు.

మీడియాపై పోలీసుల ఆగ్రహం

సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న తుళ్లూరు, నరసరావుపేట డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిను మీడియాపై చిందులు తొక్కారు. కొన్ని ఛానళ్లకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నామని హెచ్చరించారు. టీవీ ఛానళ్లు కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులు బనాయింపు

తరగతి గదుల్లో పోలీసులు బస చేస్తున్న వైనాన్ని పరిశీలించడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. గ్రామస్థులతో కలిసి మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి తరగతి గదుల్లో బల్లలపై దుస్తులు ఆరేసి ఉన్న దృశ్యాలను చిత్రీకరించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్‌.. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల చిత్రాలను తన సెల్‌లో బంధించారు. ఓ సీఐ జోక్యం చేసుకుని.. స్టేషన్‌కు వెళ్లి మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టమంటూ మహిళా కానిస్టేబుల్‌కు పురమాయించారు. ఆ మహిళా కానిస్టేబుల్‌తో మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేయించారు. కేసులు పెట్టిన మాట వాస్తవమేనని.... గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు వెల్లడించారు. మహిళా కానిస్టేబుల్‌ తరగతి గదిలో దుస్తులు మార్చుకుంటుండగా ఫొటోలు తీసినందున కేసు పెట్టామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!

sample description
Last Updated : Jan 23, 2020, 11:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.