ETV Bharat / city

ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు మరింత పెంపు.. మూడ్రోజులుగా సాగుతున్న పనులు - పోలవరం

పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తును మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్యాంకొంత మట్టితో కోర్‌... రాళ్లతో కట్టడం 44 మీటర్ల ఎత్తుకు పెంచనున్నారు. ఇంతవరకు 12వేల క్యూబిక్‌ మీటర్ల రాయి వినియోగించారు. 30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో 2,480 మీటర్ల పొడవునా తొలుత 2 మీటర్ల వెడల్పున, మీటరు ఎత్తు పెంచేందుకు నిర్ణయించారు.

Upper Coffer Dam
ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు
author img

By

Published : Jul 19, 2022, 8:58 AM IST

పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యాంను మరింత పటిష్ఠ పరచాలని నిర్ణయించారు. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం కొనసాగుతున్న పనులనే మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం ఉంది. దీన్ని మొత్తం మీద 44 మీటర్ల ఎత్తుకు పెంచనున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం సాగుతున్న పనులనే కొనసాగిస్తారు. ఇందుకు వారం నుంచి పది రోజులకు పైగా సమయం పడుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. పోలవరంవద్ద భారీ వరద వస్తుండటం, 30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో 2,480 మీటర్ల పొడవునా తొలుత 2 మీటర్ల వెడల్పున, మీటరు ఎత్తు పెంచేందుకు నిర్ణయించారు. ఈ పనులు మూడు రోజులుగా సాగుతున్నాయి.

ఇంతవరకు ఈ పనిలో 12 వేల క్యూబిక్‌ మీటర్ల రాయిని వినియోగించామని మేఘా సంస్థ సీజీఎం ఎం.ముద్దు కృష్ణ తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాంను 28.50 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా నిర్మించారు. ఇందుకోసం 38.5 మీటర్ల వరకు మట్టితో కూడిన కోర్‌తో నిర్మాణం చేపట్టాలని డిజైన్ల ప్రకారం గతంలో నిర్ణయించారు. అయితే ముందు జాగ్రత్తగా దాదాపు 40 మీటర్ల వరకు మట్టితో కోర్‌ నిర్మాణం చేపట్టి...ఆ పైన 42.5 మీటర్ల వరకు రాయితో నిర్మాణం చేపట్టారు. మొన్నటి భారీ వరద అంచనాలు, ఎగువ కాఫర్‌ డ్యాం పై నుంచి వరద ప్రవహిస్తుందనే భయాల నేపథ్యంలో హఠాత్తుగా ఎత్తు పెంపు పనులు చేపట్టారు. 2 మీటర్ల వెడల్పున మీటరు ఎత్తులో రాయితో నిర్మాణం ప్రారంభించారు.

ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద గరిష్ఠంగా 38.63 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు వచ్చింది. ఆ తర్వాత తగ్గడం ప్రారంభించింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో కాఫర్‌ డ్యాం మొత్తం 44 మీటర్ల ఎత్తుకు పెంచేలా ప్రస్తుతం చేస్తున్న పనులను కొనసాగించనున్నారు. గతంలో 40 మీటర్ల వరకు ఉన్న క్లే కోర్‌ను 41.5 మీటర్ల వరకు లేదా 42 మీటర్ల వరకు పెంచుతారు. ఆ పైన మరో రెండు మీటర్లు రాళ్లతో పటిష్ఠం చేస్తారు. ఎగువ కాఫర్‌ డ్యాం ఎగువన 9 మీటర్ల ఎత్తు ఉంది. ప్రస్తుతం 2 మీటర్ల వెడల్పుతో 44 మీటర్ల ఎత్తు వరకు ఆ పని చేయనున్నారు. మిగిలిన 7 మీటర్ల ప్రాంతంలో పైన 44 మీటర్ల ఎత్తు వచ్చే వరకు రాళ్లతో నింపి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.