ETV Bharat / city

ap in Parliament: పోలవరం ముంపు బాధితుల్లో 1.64 లక్షల మంది గిరిజనులు - పార్లమెంట్​లో ఏపీ

పోలవరం ప్రాజెక్టు కింద 1,06,006 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం అందులో 1,64,752 మంది గిరిజనులేనని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి ఇప్పటివరకు రూ.64,684 కోట్లతో 149 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇంకా పలువురు రాష్ట్ర ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు.

parlament
parlament
author img

By

Published : Feb 3, 2022, 9:39 AM IST

పోలవరం ప్రాజెక్టు కింద 1,06,006 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం అందులో 1,64,752 మంది గిరిజనులేనని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్‌ పాత్ర అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,06,006 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇందులో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 56,504 కుటుంబాలు, 1,64,752 మంది వ్యక్తులు గిరిజనులే. ప్రస్తుతం సామాజిక, ఆర్థిక సర్వే చింతూరు, యటపాక యూనిట్లలో +45 కాంటూర్‌ వరకే పూర్తయినందున ఈ నిర్వాసిత కుటుంబాల లెక్క తాత్కాలికమే. సహాయ, పునరావాస పథకాలకు ఆమోదముద్ర లభించిన తర్వాత ఈ నిర్వాసిత కుటుంబాల సంఖ్య ఖరారవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో పోలవరం వల్ల ముంపు తలెత్తకుండా రక్షణ గోడల నిర్మాణాన్ని తలపెట్టినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పింది. ఆ గోడలు నిర్మించకపోతే ఒడిశాలో 1,002 (913 గిరిజన), ఛత్తీస్‌గఢ్‌లో 2,335 (1,294 గిరిజన) కుటుంబాలు ప్రభావితమవుతాయి. ముంపునకు గురయ్యే గిరిజన కుటుంబాలకు పరిహారంగా భూమికి భూమి లేదా రెండున్నర ఎకరాలు (ఇందులో ఏది తక్కువైతే అది) అందిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. గిరిజన తెగల వారికి షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనే పునరావాసం కల్పించామంది. ముంపు బాధితులకు 2013 భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం రూ.6.86 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపింది. నిరుద్యోగ యువత జీవనోపాధి కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లూ పేర్కొంది’ అని వివరించారు.

రూ.64 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం... రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి గడ్కరీ

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి ఇప్పటివరకు రూ.64,684 కోట్లతో 149 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇందులో ఇప్పటివరకు రూ.22,556 కోట్ల విలువైన 66 పనులు పూర్తయినట్లు చెప్పారు. రూ.27,800 కోట్ల విలువైన 62 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.14,328 కోట్ల విలువైన 21 పనులను ఇటీవలే అప్పగించినట్లు వెల్లడించారు. 2014 మే నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 6,590 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, 2022 జనవరి నాటికి అది 8,207 కిలోమీటర్లకు చేరినట్లు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత్‌మాల పరియోజన కింద ఏపీలో 36, తెలంగాణలో 17 ప్రాజెక్టులు

భారత్‌మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘దీనికింద ఆంధ్రప్రదేశ్‌లో 1,409.13 కిలోమీటర్ల పొడవైన 36 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకు 879.15 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మిగతా వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. తెలంగాణలో 969.41 కిలోమీటర్ల పొడవైన 17 ప్రాజెక్టులు చేపట్టాం. అందులో 730.59 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది’’ అని తెలిపారు. భారత్‌మాల ఫేజ్‌-1 కింద బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని బంగారుపాలెం-గుడిపాల మధ్య రూ.1,138 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వైకాపా సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ అడిగిన మరో ప్రశ్నలకు గడ్కరీ సమాధానమిచ్చారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేసేలా గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పనులను అప్పగించినట్లు తెలిపారు. భారత్‌మాల-1 కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.30,551 కోట్ల విలువైన 857 కిలోమీటర్ల ప్రాజెక్టులు మంజూరుచేయగా, అందులో 311 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.

ఏపీలో మూడు జాతీయ విద్యాసంస్థలకు శాశ్వత ప్రాంగణాలు: కేంద్రం
రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 7 ఉన్నత విద్యాసంస్థల్లో మూడింటి శాశ్వత ప్రాంగణాల నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘తాడేపల్ల్లిగూడెంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) నిర్మాణం రూ.533 కోట్లతో పూర్తయింది. తిరుపతి ఐఐటీ ఈ ఏడాది నవంబర్‌, వైజాగ్‌ ఐఐఎం మొదటి దశ సెప్టెంబర్‌, కర్నూలు ట్రిపుల్‌ఐటీ(డీఎం) నిర్మాణం డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయి. ఈ మూడు సంస్థలకు మొత్తం రూ.1,816 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశాం. తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌ నిర్మాణం 2023 జూన్‌ నాటికి పూర్తవుతుంది. దాని నిర్మాణానికి రూ.1,491.34 కోట్లు కేటాయించగా, రూ.417.13 కోట్లు విడుదల చేశాం. అనంతపురం సెంట్రల్‌ యూనివర్శిటీ నిర్మాణానికి బృహత్‌ప్రణాళిక ఖరారైంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి స్థల ఎంపిక కమిటీ విజయనగరం జిల్లాలో స్థలాన్ని ఖరారు చేసింది. దాన్ని బదిలీ చేయాలని నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది’ అని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలి : తెదేపా ఎంపీ కనకమేడల డిమాండ్‌
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మాదిగ, రెల్లి కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. విభజన లేకపోవడం వల్ల ఎస్సీల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నాయి. మిగతా కులాలు ఆ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. విద్య, ఉద్యోగాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను చట్ట సవరణ ద్వారా పరిష్కరించాలి. జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. కేంద్రం స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకోవాలి...’’ అని ఆయన కోరారు.

కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ సంస్థల నిధులను మళ్లించి ఉపసంహరించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని తగిన నిర్దేశాలు జారీ చేస్తామని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఉపసంహరించకుండా తగిన నిర్దేశాలు జారీ చేయడానికి కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుందా? అని తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పై మేరకు బదులిచ్చారు. దీనిపై సమీక్షిస్తామని, ఒక వేళ అలా జరిగి ఉంటే కచ్చితంగా వివరణ కోరుతామని కేంద్ర మంత్రి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

8 ఏళ్లయింది.. ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు : వైకాపా ఎంపీ మార్గాని భరత్‌
ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలుకు ఉన్న పదేళ్ల గడువులో ఇప్పటికే 8 ఏళ్లు పూర్తయిందనీ అయితే ఇచ్చిన హామీల్లో ఒక్క ప్రాజెక్టూ ఇప్పటివరకూ పూర్తికాలేదని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. హామీల అమలు వేగాన్ని కేంద్రం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘దేశం అమృత కాలంలోకి ప్రవేశించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అమృత బిందువుల కోసం ఎదురుచూస్తోంది. విభజన చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేం కాదనడం లేదు. అయితే అమలు మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. రాష్ట్ర అశాస్త్రీయ విభజన జరిగి 8 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. విద్యాసంస్థలు, పోలవరం, రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌, రిఫైనరీ, పారిశ్రామిక కారిడార్లు, మెట్రో ప్రాజెక్టులు లాంటివి ఎన్నో విభజన చట్టంలో పెట్టారు. విభజన సమయంలో ఏపీకి రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చింది. దాన్ని భర్తీ చేస్తామని కేంద్రం చెప్పినా కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.18వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికైనా ఆర్థికమంత్రి దాన్ని క్లియర్‌ చేయాలి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చుచేసి దాన్ని తిరిగి చెల్లించమని అడుగుతోంది. చరిత్రలో ఎన్నడూ జాతీయ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఈ ప్రాజెక్టు కింద ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తే ముంపు బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించడానికి వీలవుతుంది. విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నం పోర్టు పనులు 2021 చివరికల్లా పూర్తికావాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభంకాలేదు. దాని బదులు రామాయపట్నం పోర్టును కేంద్రం చేపట్టాలి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సకాలంలో అనుమతులు ఇస్తే అది 3 ఏళ్ల నిర్ణీత సమయంలో పూర్తికావడానికి వీలవుతుంది. మన్నవరంలో సెమీకండక్టర్‌ తయారీ జోన్‌ ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణ వేగాన్ని పెంచి దిల్లీ-ముంబాయి కారిడార్‌ స్థాయిలో అమలుచేయాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలి. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చాలి. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరీ అనుసంధాన డీపీఆర్‌ ఖరారులో కేంద్ర ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మేం పూర్తి సహకారం అందిస్తాం’ అని భరత్‌ పేర్కొన్నారు.

తితిదే ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలి: వైకాపా నేత విజయసాయి రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) సంబంధించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ శూన్య గంటలో బుధవారం ఆయన మాట్లాడారు. తితిదే పలు సామాజిక, విద్యా, ధార్మిక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వాటి నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. స్థానికంగా భక్తుల ద్వారా వచ్చే కానుకలతోపాటు విదేశాల్లోని భక్తులు ఇచ్చే విరాళాలతో తితిదే ఆ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. విదేశీ భక్తుల విరాళాల స్వీకరణకు తితిదే ఎఫ్‌సీఆర్‌ఏ కింద గతంలోనే రిజిస్ట్రేషన్‌ పొందిందని వివరించారు. ఇటీవల సాంకేతిక కారణాలను చూపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తితిదే రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణను నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తితిదేకి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రిజిస్ట్రేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ఇదీ చదవండి: Decreasing salaries with new PRC: కొత్త పీఆర్సీతో తగ్గుతున్న జీతాలు... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.